Friday, November 22, 2024

మహిళలకే పట్టాభిషేకం…

హైదరాబాద్‌, : పురపీఠాలన్నీ గులాబీ ఖాతాలో పడ్డాయి. ఏడింటికి ఏడు స్థానాలు నెగ్గిన టీఆర్‌ఎస్‌.. మేయర్లు, ఛైర్మన్ల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహ రించింది. జనరల్‌ స్థానాల్లోనూ బలహీన వర్గాల మహిళలకు.. పదవులిచ్చి ముఖ్య మంత్రి కేసీఆర్‌ తనదైన ముద్ర వేశారు. గత మునిసిపల్‌ ఛైర్మన్లు, జడ్పీ ఛైర్మన్ల నియా మకాల సందర్భంగా బలహీనవర్గాలకే పెద్దపీఠ వేసిన సీఎం.. ఇపుడూ అదే పంథా లో తన మార్క్‌ చూపారు. మంత్రులు, ముఖ్యనేతలను ఆయా పురపాలక సంస్థ లకు ఇన్‌ఛార్జిలుగా పంపి ఉత్కంఠ కలిగిం చినా.. అభ్యర్ధుల ఎంపికలో మెజారిటీ పదవులు బలహీనవర్గాలకు కేటాయిం చడం, రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాల డిప్యూటీ మేయర్‌ పదవులు ముస్లిం మైనా రిటీ మహిళలకే కేటాయించడం సంచలనం గా మారింది. ఒక్క ఖమ్మం మినహా మిగతా ఆరు పురపాలక సంస్థల ఛైర్మన్‌ పదవులు కూడా బీసీలకే దక్కగా.. వైస్‌ ఛైర్మన్లుగా కూడా మహిళలను ఎంపిక చేసి సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌ మేయర్లు, డిప్యూటీ మేయర్ల పదవులు మహి ళలనే వరించాయి. సిద్దిపేట, కొత్తూరు మునిసిపాలిటీల చైర్మన్‌ పద వులు మహిళలకు దక్కగా, జడ్చర్ల మునిసిపాలిటీ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవులు కూడా మహిళలకే వరించాయి. అచ్చంపేట, నకిరేకల్‌ మునిసిపాలిటీల వైస్‌ చైర్మన్‌ పదవులను మహిళలు దక్కించు కున్నారు. మొత్తంగా ఈ రెండు కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీల్లో మహిళలకే పట్టాభిషేకం జరిగింది.
గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌గా గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్‌గా రిజ్వానా షమీమ్‌, ఖమ్మం కార్పొరేషన్‌ మేయర్‌గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌గా ఫాతిమా జోహ్రో ప్రమాణ స్వీకారం చేశారు. ఏడు పురపాలిక పీఠాల్లోనూ మహిళల నాయకత్వం లేని పురపాలిక లేకపోవడం విశేషం. మహిళలకు 50 శాతం సీట్లిచ్చినా.. రిజర్వేషన్‌ ఉంటే తప్ప మహిళలకు పదవులు కేటాయి ంచని సమయంలో.. సీఎం కేసీఆర్‌ రాజకీయాల్లో సరికొత్త సంప్రదా యానికి శ్రీకారం చుట్టారని, మహిళా పక్షపాతిగా నిరూపించుకు న్నారని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు.
వరంగల్‌ మేయర్‌గా గుండు సుధారాణి
గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్‌గా రిజ్వానా షమీమ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌, ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. గుండు సుధారాణి 29వ డివిజన్‌ నుంచి గెలుపొందగా, రిజ్వానా షమీమ్‌ 36వ డివిజన్‌ నుంచి గెలుపొందారు. గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లు ఉండగా, టీఆర్‌ఎస్‌ 48, బీజేపీ 10, కాంగ్రెస్‌ 4, ఇతరులు నాలుగు స్థానాల్లో గెలుపొందారు. గుండుసుధారాణి ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్నారు.
ఖమ్మం మేయర్‌గా పునుకొల్లు నీరజ,
డిప్యూటీ మేయర్‌గా ఫాతిమా జోహ్రో
ఖమ్మం మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌గా ఫాతిమా జోహ్రో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. పునుకొల్లు నీరజ 26వ డివిజన్‌ నుంచి గెలుపొందగా, ఫాతిమా జోహ్రో 37వ డివి జన్‌ నుంచి గెలుపొందారు. ఖమ్మం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో మొత్తం 60 స్థానాలకు టీఆర్‌ఎస్‌ 45, కాంగ్రెస్‌ 10, ఇతరులు 5 డివిజ న్లలో గెలుపొందగా, బీజేపీ ఒక డివిజన్‌లో మాత్రమే గెలిచింది. ఇక్కడ ముస్లిం మైనారిటీకి చెందిన మహిళకు డిప్యూటీ మేయర్‌ పదవిని ఇవ్వడంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
సిద్దిపేట మునిసిపల్‌ చైర్మన్‌గా మంజుల
సిద్దిపేట మునిసిపల్‌ చైర్మన్‌గా కడవేర్గు మంజుల, వైస్‌చైర్మన్‌గా కనకరాజు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరూ బీసీలే కావడం విశేషం. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు, ఎన్నికల పరిశీలకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, రవీందర్‌ సింగ్‌తో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.
అచ్చంపేట మునిసిపాలిటీ చైర్మన్‌గా
ఎడ్ల నర్సింహ గౌడ్‌
అచ్చంపేట మునిసిపాలిటీ చైర్మన్‌గా ఎడ్ల నర్సింహ గౌడ్‌, వైస్‌చైర్మన్‌గా విష్ణువర్దన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎడ్ల నర్సింహ గౌడ్‌ 16వ వార్డు, శైలజ 19వ వార్డు నుంచి గెలుపొందారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జడ్చర్ల మునిసిపాలిటీ చైర్మన్‌గా లక్ష్మీ రవీందర్‌, వైస్‌ చైర్మన్‌గా సారికా రామ్మోహన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. కొత్తూరు మునిసిపాలిటీ చైర్మన్‌గా బాతుక లావణ్య యాదవ్‌, వైస్‌ చైర్మన్‌గా డోలీ రవీందర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ పాల్గొన్నారు.
నకిరేకల్‌ మునిసిపాలిటీ చైర్మన్‌గా
రాచకొండ శ్రీనివాస్‌ గౌడ్‌
నకిరేకల్‌ మునిసిపాలిటీ చైర్మన్‌గా రాచకొండ శ్రీనివాస్‌ గౌడ్‌, వైస్‌ చైర్మన్‌గా శెట్టి ఉమారాణి ప్రమాణ స్వీకారం చేశారు. రాచకొండ శ్రీనివాస్‌ 19వ వార్డు, శెట్టి ఉమారాణి 11వ వార్డు నుంచి గెలుపొం దారు. ఎన్నిక కార్యక్రమానికి విద్యుత్‌ శాఖా మంత్రి జగదీష్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే లింగయ్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement