బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేశారు. ఇవాళ సభాపతి ఛాంబర్‌లో ప్రమాణం చేశారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ సమక్షంలో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. కేసీఆర్ తుంటి ఎముకకు ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. శస్త్రచికిత్స నుంచి కోలుకున్న కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ కు 39 సీట్లు, బిజెపి 8, ఎంఐఎం 7 సీట్లు రావడంతో ప్రతిపక్ష హోదాలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు రావడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసి పాలకపక్షంలో ఉన్నారు. సిపిఐ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఒక సీటు గెలుచుకుంది.