Monday, September 30, 2024

Harithotsavam – మరి కొద్దిసేపటిలో తుమ్మలూరు పార్కులో మొక్కలు నాటనున్న కెసిఆర్

హైదరాబాద్ – తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తెలంగాణ హరితోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. హరితోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని తుమ్మలూరు అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులో మొక్కలు నాటనున్నారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని అధికారులు ఏర్పాట్లు చేశారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా తొమ్మిదేళ్లలో రికార్డుస్థాయిలో 273 కోట్ల మొక్కలను నాటినట్లు ప్రభుత్వం తెలిపింది. 2015-16 లో అటవీ విస్తీర్ణం 19 వేల 854 చదరపు కిలోమీటర్లు ఉండగా… 2023 నాటికి 26 వేల 969 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని వెల్లడించింది. హరితోత్సవంలో ప్రజలు భారీగా పాల్గొనాలని సర్కారు కోరింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement