హైదరాబాద్ – ఆరు నెలల విరామం తర్వాత మే 2న సీఎం కేసీఆర్ ఢిల్లి వెళ్లనున్నారు. మూడు, నాలుగు రోజులపాటు అక్కడే ఉండనున్న కేసీఆర్ జాతీయ రాజకీయాలపై అందుబాటులో ఉన్న జాతీయ నేతలను కలిసి చర్చించనున్నారు. నాలుగో తేదీన ఢిల్లిలో నిర్మాణంలో ఉన్న భారాస జాతీయ కార్యాల యాన్ని సందర్శించి పనులపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లి, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవాన్ మాన్‌సింగ్‌తోపాటు ఆర్థిక, రాజకీయ రంగాలకు చెందిన నిష్ణాతులు, పలువురు విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్‌లను కలవనున్నట్లు తెలుస్తోంది. జాతీయస్థాయిలో భాజపాకు ప్రత్యామ్న్యాయంగా కూటమి ఏర్పాటు చేసే దిశగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా సీఎం కేసీఆర్ సైతం ఈ అంశంపై జాతీయస్థాయి నేతలతో చర్చించనున్నట్లు సమాచారం.
Advertisement
తాజా వార్తలు
Advertisement