Monday, November 25, 2024

కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాలి : కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థత కారణంగా హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చేరారు. ఆయ‌న‌కు వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన అనంత‌రం డాక్ట‌ర్లు సీఎంను డిశ్చార్జ్ చేసిన సంగతి తెలిసిందే. వైద్యులు ఆయనకు యాంజియోగ్రామ్, సీటీ స్కాన్, ఈసీజీ తదితర టెస్టులు నిర్వహించారు. కేసీఆర్ ప్రస్తుతం బాగున్నారని, రక్త నాళాల్లో బ్లాక్స్ లేవని తెలిపారు. కొంత విశ్రాంతి తీసుకోవాలని సీఎంకు సూచించామని డాక్ట‌ర్లు చెప్పారు. అయితే సీఎం కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ట్విట్ట‌ర్ ద్వారా కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement