తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశా వర్కర్లకు శుభవార్తను అందించారు. ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న వారి కోరికను నెరవేర్చారు. రాష్ట్రంలోని ఆశావర్కర్ల నెలవారీ ప్రోత్సాహకాలను 30శాతం పెంచుతూ కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కింద పనిచేస్తున్న, నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ఈ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నెలవారీ ప్రోత్సాహకాలతో ఆశావర్కర్ల నెలవారీ జీతం పెరగనుంది.
తెలంగాణ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం మేరకు ఆశావర్కర్లు ఇకపై నెలకు రూ.7,500 జీతం బదులుగా రూ.9,750 తీసుకోనున్నారు. గతేడాది జూన్ నుంచి పెంచిన ప్రోత్సాహకాలను అమలు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆశా వర్కర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital