బోథ్ జూన్ 21 ప్రభ న్యూస్ – తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని విట్టలేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక దినోత్సవంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ముఖ్యఅతిథిగా హాజరయి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 9 ఆలయాలకు ధూప దీప నైవేద్యం ద్వారా మంజూరు అయిన ప్రొసీడింగ్ లను పూజరులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆధ్యాత్మిక రంగానికి పెద్ద పీట వేసిందని అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆలయాలు అభివృద్ధికి నోచుకున్నాయని అన్నారు. రాష్ట్రం వచ్చాకనే కుల మతాలకు అతీతంగా ఆలయాల అభివృద్ధి జరిగిందని సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని నిర్మించి చరిత్ర సృష్టించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నారాయణ రెడ్డి, ఎఎంసి చైర్మన్ రుక్మన్ సింగ్, వైస్ ఎంపిపి లింబాజి, వైస్ చైర్మన్ సంజీవ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎలుక రాజు, సర్పంచ్ సురేందర్, సుభాష్, జగన్ రెడ్డి, రమణ, తదితరులు ఉన్నారు.