Saturday, November 23, 2024

బంగారు తెలంగాణ‌కు బాట‌లు వేస్తున్న కేసీఆర్ : మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

తెలంగాణ ప్రదాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా మారి అభివృద్ధి ప్రదాత అయ్యారని, బంగారు తెలంగాణా నిర్మాణానికి బాటలు వేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మునిసిపాలిటీ అభివృద్ధికి బాటలు వేస్తూ పలు పనులకు మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. సుమారు రూ.90 లక్షలతో చేపట్టే సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లు, ఓపెన్ జిమ్ పనులకు శంకుస్థాపన లు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మునిసిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో పట్టణాలకు నూతన హంగులు వ‌స్తున్నాయ‌న్నారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి- సంక్షేమ పథకాలను రెండు కళ్ళలాగా చూస్తూ ముందుకు వెళ్తుందన్నారు. కోట్లాది రూపాయల నిధులతో పట్టణాల అభివృద్ధి చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. కాలనీల్లో కనీస సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయలతో చేపడుతున్నట్లు తెలిపారు. ఇటీవలి ఒకే రోజు నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతాల్లో 371 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. పనులు నాణ్యతగా చేయాలని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement