ఆదిలాబాద్ – తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ లేదని.. కేసీఆర్‌ది నిన్నటి పార్టీ అని ఎద్దేవా చేశారు కేంద్రమంత్రి, టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. పదేళ్లు కుటుంబ, అవినీతి పాలనను కేసీఆర్ తెలంగాణ ప్రజలపై రుద్దారని ఆరోపించారు. ఆదిలాబాద్ లో సోమవారం జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగిస్తూ… అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తిరస్కరించారని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన రోడు మ్యాప్ లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. మూడవ సారి మోదీని ప్రధానిగా ఆశీర్వదించాలని కోరారు. పదేళ్లలో ప్రధాని దేశ ముఖ చిత్రాన్ని మార్చేశారని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని 17 సీట్లలో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ఎంఐఎంను కూడా ఓడిద్దామని పిలుపునిచ్చారు.