వనపర్తి/పెద్దమందడి: మే 4 (ప్రభ న్యూస్); ఈనెల 6న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనుల సందర్శనకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు వెళ్లాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రి నిరంజన్ రెడ్డిని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సిఈ హమీద్ ఖాన్,డీఈ సత్యనారాయణ గౌడ్ లు మర్యాదపూర్వకంగా కలిసి పనుల పురోగతిపై వివరించారు. ఈ సందర్భంగా నూతన సచివాలయంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల ప్రగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సమావేశం నిర్వహించారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. జూలై నాటికి కరివెన ఆగస్టు నాటికి ఉదండాపూర్ కు నీటిని ఎత్తిపోయాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఎత్తిపోతల పనులను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధుల బృందం సందర్శించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎంఓ కార్యదర్శి స్మిత సబర్వాల్, ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, ఈఎన్ సి మురళీధర్ లు సందర్శిస్తారని ఆయన తెలిపారు.
6న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనుల సందర్శనకు వెళ్లండి…ముఖ్యమంత్రి ఆదేశం
Advertisement
తాజా వార్తలు
Advertisement