హైదరాబాద్, : లాక్ డౌన్ వల్ల ఉపయోగం లేదని, అనేక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. లాక్డౌన్ ఎందుకు విధించకూడదన్న అంశంపై సీఎం కేసీఆర్ లోతైన విశ్లేషణ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 25 నుంచి 30 లక్షల మంది ఇతర రాష్ట్రాలనుంచి కార్మికులు పనిచేస్తున్నారు. మెదటి వేవ్ కరోనా సమయంలో లాక్ డౌన్ విధించడం ద్వారా వీరందరి జీవితాలు చెల్లా చెదురైన పరిస్థితిని చూసాం. వీరంతా డిస్ లొకేట్ అయితే తిరిగి రావడం కష్టం. అదే సమయంలో రాష్ట్రంలో ధాన్యం పుష్కలంగా పండింది. తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో 6144 వరిధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో వరి ధాన్యం నిండివున్నది. ప్రస్తుతం అక్కడ వడ్ల కాంటా నడుస్తున్నది. వరి కొనుగోలు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దీనిలో కిందినుంచి మీది దాక చైన్ సిస్టం ఇమిడి వుంటది. ఐకెపి కేంద్రాల బాధ్యులు, హమాలీలు, తూకం వేసేందుకు కాంటా పెట్టేవాల్లు మిల్లులకు తరలించే కూలీలు లారీలు ట్రాన్స్ పోర్ట్ వెహకిల్స్ మిల్లులకు చేరవేయడం అక్కడ తిరిగి దించడం మల్లా అక్కడినుంచి ఎఫ్సి ఏ గోడౌన్లకు తరలించడం మల్లి అక్కడ దించడం స్టాక్ చేయడం తిరిగి వివిధ ప్రాంతాలకు పంపిణీ చేయడం …ఇంత వ్యవహారం వుంటది. ఈమెత్తం వ్యవహారంలో లక్షలాది మంది భాగస్వా ములౌతారు. వివిధ రాష్ట్రాలనుంచి వచ్చి రైసు మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులు ఏమౌతారు? లాక్ డౌన్ విధిస్తే ఇంతమంది ఎక్కడపోతారు.? కార్మికులు చల్లాచెదురై పోతే తిరిగి వారిని రప్పించడం ఎట్లా ? కోనుగోలు చేయక పోతే పండించిన వరి ధాన్యాన్ని రైతు ఎక్కడ పెట్టుకుంటాడు? మెత్తం ధాన్యం కొనుగోల్ల వ్యవస్థ ఎక్కడికక్కడ స్థంభించి పోయే ప్రమాదమున్నది. తద్వారా సంభవించే సంక్షోభం ఘోరంగా వుండే ప్రమాదం వుంది. అదే సమయంలో నిత్యావసర సరుకులు, పాలు కూరగాయలు పండ్లు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసులు, ప్రసవాలు, పారిశుద్య కార్యక్రమాలు వంటి అత్యవసర కార్యక్రమాలను ఆపివేయలేం. అదే సమయంలో ఇతర రాష్ట్రాలనుంచి వాక్సీన్లు మెడిసిన్ ఆక్సీజన్లను ఇతర నిత్యావసరాలను సరఫరా చేసుకుం టున్నం.. లాక్ డౌన్ విధిస్తే వీటన్నిటికి ఆటంకం ఏర్పడుతది. ఇన్ని కారణాలవల్ల ప్రభుత్వమే ఒక భయానక పరిస్థితిని సృష్టించినట్లవుతుంది అందుకు ప్రభుత్వం సిద్దంగా లేదు,, కాబట్టి లాక్ డౌన్ విధించలేం. కేసులు ఎక్కువగా వున్న ప్రాంతాలను గుర్తించి వాటిని, మైక్రోలెవల్ కంటైెన్మెంట్ జోన్లను ప్రకటించి కరోనా నిరోధక చర్యలను తక్షణమే చేపడుతాం..” అని సిఎం వివరించారు. లాక్డౌన్తో ఆకలి సంక్షోభం తలెత్తే ప్రమాదమున్నది. గొంతు పిస్కినట్టు చేస్తే మొత్తం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలి పోయే ప్రమాద మున్నది. కాబట్టి గతంలో అనుభవాలను దృష్టిలో వుంచుకోని లాక్ డౌన్ ను విధంచకూ డదని ప్రభుత్వం నిర్ణయించింది.” అని స్పష్టం చేశారు.
లాక్ డౌన్ తో ఆకలి సంక్షోభం – కె సి ఆర్
By sree nivas
- Tags
- hyderabad daily news
- Hyderabad live news
- hyderabad news telugu live
- hyderabad updates
- kcr
- LOCK DOWN
- Telagana
- Telanagana News
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- TS News Today Telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement