ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి నేడు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు కాళోజీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాళోజీ మాతృభాష స్ఫూర్తి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ అస్తిత్వ స్పృహను అందించారని అన్నారు. అటు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ప్రజాకవి కి కాళోజీ నారాయణరావ్ కు నివాళులు అర్పించారు. తెలంగాణ కోసం కాళోజీ సిద్ధాంతాలను అమలు చేయాలని.. కాళోజీ ఆశయాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాళోజీ నా గొడవ లో ప్రజల గొడవ ఆవిష్కరించారని… తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు కాళోజీ కృషి మరువలేనిదన్నారు. సాహిత్య, బాషా రంగాలలో కాళోజీ చేసిన సేవలు ఎన్నటికీ మారువలేనివని తెలిపారు. కాళోజీ తెలంగాణ ఉద్యమంలో ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేర దాకా తరిమికొడదాం.. ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతి పెడదాం అన్నారు.
ఇది కూడా చదవండి: T20world cup: టీమిండియా స్క్వాడ్ ఇదే