Friday, November 22, 2024

దేశ భ‌విష్య‌త్ ను మార్చాల్సిందే రైతులే -కెసిఆర్

హైద‌రాబాద్ : దేశాన్ని 14 మంది ప్ర‌ధానులు పాలించినా రైతుల త‌ల‌రాత మారలేద‌ని బిఆర్ఎస్ పార్టీ అధినేత‌,తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ అన్నారు… రైతులు క‌డ‌గండ్లు తీరాలంటే రైతులంద‌రూ ఏకం కావాల‌ని ఆయ‌న పిలుపు ఇచ్చారు.. మ‌హారాష్ట్ర షెట్కారీ సంఘ‌ట‌న్ రైతు నేత శ‌ర‌ద్ జోషి ప్ర‌ణీత్ తో పాటు పలువురు రైతు నేత‌లు తెలంగాణ భ‌వ‌న్ లో నేడు జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. వారంద‌రికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.


ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ,13 నెల‌ల పాటు దేశ రాజ‌ధానిలో రైతులు పోరాడారు అని గుర్తు చేశారు. ప్ర‌స్తుత పాల‌కులు న‌ల్ల చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మించిన రైతుల‌ను ఉగ్ర‌వాదుల‌ని, ఖ‌లీస్తానీల‌ని, వేర్పాటువాదుల‌ని అన్నారు. రైతుల పోరాటంతో మోడీ దిగివ‌చ్చి క్ష‌మాప‌ణ చెప్పార‌ని గుర్తు చేశారు.. కాగాఈ పోరాటంలో 750 మంది రైతులు చ‌నిపోతే ప్ర‌ధాని క‌నీసం స్పందించ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు… రైతుల పోరాటం న్యాయ‌బ‌ద్ధ‌మైన‌ద‌ని,వారు త‌లచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండ‌ద‌న్నారు.. మ‌నం చేసేప‌నిలో చిత్త‌శుద్ధి ఉంటే విజ‌యం సాధిస్తామ‌ని పేర్కొన్నారు కెసిఆర్.. కాగా,పార్టీలో చేరిన నేత‌లంద‌రూ కాళేశ్వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించాల‌ని కోరారు.

తెలంగాణ ఏర్ప‌డ‌క ముందు రైతులు, చేనేత‌లు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునేవారు అని కేసీఆర్ గుర్తు చేశారు. వ్య‌వ‌సాయాన్ని సుస్థిరం చేశాక రైతుల ఆత్మ‌హ‌త్య‌లు ఆగాయి. రైతుల గోస చూసి నాకు క‌న్నీళ్లు వ‌చ్చేవి. దేశంలో 94 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రి పండుతుంది. అందులో 56 ల‌క్ష‌ల ఎక‌రాల వ‌రి తెలంగాణ‌లోనే పండుతుంది అని కేసీఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement