మహారాష్ట్ర తుల్జాపూర్‌లో కొలువైన తుల్జా భవానీ అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయంలో భవానీ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్ ఆశ్వీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ అధికారులు సీఎం కేసీఆర్ కి సాంప్రదాయబద్ధంగా తలపాగను ధరింపజేసి, శాలువాతో సత్కరించి అమ్మవారిని ప్రతిమను బహూకరించారు
అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయణమయ్యారు. అంతకు ముందు విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం సమాధానాలు ఇచ్చారు. అమ్మవారు స్వయంగా పిలిపించుకుంటే తప్ప అమ్మవారి దర్శనం సాధారణంగా జరిగేది కాదని సీఎం తెలిపారు. ఉదయం విఠలేశ్వరుని దర్శనం, ఇప్పుడు తుల్జా భవాని దర్శనం తనకెంతో ఆనందాన్నిస్తుందని, ఇది తమకు దక్కిన అదృష్టంగా సీఎం పేర్కొన్నారు. సకల జనుల సంక్షేమం కోసం పాటుపడే తాము ఉదయం బ్రహ్మాండ నాయకుడైన విఠలున్ని, తుల్జా భవానీ మాతను కూడా అదే ప్రార్థించానని ముఖ్యమంత్రి తెలిపారు. దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను సుభిక్షంగా సుఖః సంతోషాలతో వర్ధిల్లేలా చూడాలని ప్రార్థించానన్నారు
అంతకుముందు. ఆయనకు ఆలయం వద్ద అధికారులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ తదితరులు ఉన్నారు
BRS President, CM Sri KCR visited and offered prayers at the Shri Tuljabhavani Temple in Tuljapur, Maharashtra.
— BRS Party (@BRSparty) June 27, 2023
మహారాష్ట్రలోని తుల్జాపూర్‌లో కొలువైన తుల్జా భవాని అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు. pic.twitter.com/Zxmf4cJqXN