బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మిర్యాలగూడకు బయల్దేరారు. నందినగర్ నివాసం నుంచి బీఆర్ఎస్ భవన్ కు చేరుకున్న కేసీఆర్ అక్కడి నుంచి మిర్యాలగూడకు బయల్దేరారు. కేసీఆర్ నేటి నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. మరికాసేపట్లో కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మే 10 వరకు 17 రోజుల పాటు జరిగే ఈ బస్సుయాత్రలో భాగంగా 40కి పైగా పట్టణాల్లో జరిగే రోడ్ షోలలో కేసీఆర్ పాల్గొని లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.
రైతుల కోసం, రాష్ట్రం కోసం 2 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు, వివిధ వర్గాల ప్రజలతో మమేకం కానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు మార్గనిర్దేశనం చేయనున్నారు. కేసీఆర్ ప్రయాణించే బస్సుకు ‘తెలంగాణ ప్రగతి రథం’అని నామకరణం చేశారు.