Friday, November 22, 2024

BRS Party – భాజ‌పా ముక్త్ భార‌త్ కోసం…కెసిఆర్ దే ‘కీ’ రోల్

గత నెలలో పాట్నాలో జరిగిన విపక్ష పార్టీల భేటీ-కి బీఆర్‌ఎస్‌ హాజరు కాలేదు. అయితే, నిన్నటికి నిన్న ఖమ్మం సభలో పాల్గొన్న రాహుల్‌గాంధీ బీజేపీకి బీ టీ-ం కాబట్టే తాము కేసీఆర్‌కు ఆహ్వానం పంపవద్దని కోరామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ను ఆహ్వానిస్తే తాము హాజరుకోబోమని కూడా చెప్పామని పేర్కొన్నారు. అంటే బీఆర్‌ఎస్‌ విషయంలో కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం చాలా పట్టుదలగా ఉందని రాహుల్‌ మాటలను బట్టి అర్థమవుతోంది. మరో వైపు చూస్తే అఖిలేష్‌ యాదవ్‌ ఎస్పీతో యూపీలో కాంగ్రెస్‌ పొత్తులో ఉంది. ఈ రెండు పార్టీల మధ్య మంచి రిలేషన్స్‌ ఉన్నాయి. అలాంటిది ఇపుడు అఖిలేష్‌ యాదవ్‌ కేసీఆర్‌తో భేటీ- కావడం వెనక గమనించదగిన ఆంతర్యమే ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఉద్యమ పార్టీని జాతీయ పార్టీగా మార్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దేశ రాజకీయాల్లో మరింత కీలకమే కాదు.. క్రియాశీలకం కాబోతున్నారు. జాతీయ స్థాయిలో మోడీ పాలనను వ్యతిరేకిస్తున్న విపక్ష పార్టీల దూతగా ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ సోమవారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో భేటీ కావడం అందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. భేటీకి ముందు అఖిలేష్‌ మాట్లాడిన మాటలు కూడా పదునైన కేసీఆర్‌ వ్యూహం దేశ రాజకీయాల్లో అవశ్యమన్న సంకేతా న్నిచ్చాయి. దేశ పాలనలో వైఫల్యాలపై కేంద్రంలోని భాజపా సర్కారును నేరుగా ప్రశ్నిస్తూ, ప్రతి సంద ర్భంలోనూ నిలదీస్తున్న కేసీఆర్‌ సరైన మార్గదర్శకుడని బీజేపీ వ్యతిరేక రాజకీయ పక్షాలన్నీ గుర్తించాయి. భారత రాష్ట్ర సమితి ద్వారా మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో రాజకీయ కార్యకలాపాలు జాతీయ స్థాయిలో విపక్షాల దృష్టిని ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో నరేంద్రమోడీని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తున్న విపక్షాల కూటమికి ముఖ్య సలహాదారుడిగా ఉండాలని అఖిలేష్‌ యాదవ్‌ కోరినట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. బీజేపీ ‘ముక్త్‌ భారత్‌’ కోసం కలిపి పోరాడేందుకు నాయకత్వం వహించాలని ఈ సందర్భంగా కేసీఆర్‌ను కోరినట్లు తెలుస్తోంది. దేశంలో ప్రతిపక్షాలు అన్నీ ఒక్కటైతే, బీజేపీని ఓడించగలమని అఖిలేష్‌ పేర్కొన్నారు.

ఇక కేసీఆర్‌ కూడా ఆ మధ్య అంతా దేశంలోని అనేక పార్టీల నేతలను కలసి వచ్చారు. అలా అఖిలేష్‌తో కేసీఆర్‌ కలవడం, ఆయన కూడా అప్పట్లో హైదరాబాద్‌కి రావడం జరిగాయి. దీంతో ఇపుడు కేసీఆర్‌ని అఖిలేష్‌ కలవడం వెనక బీఆర్‌ఎస్‌ని విపక్ష కూటమిలోకి ఆహ్వానించడం, కూటమికి పెద్దన్న పాత్ర పోషించాలన్న ఆరాటం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటు-న్నారు. మరోవైపు చూస్తే దేశంలోని ఇతర పార్టీలతో పొత్తు పెట్టు-కుని దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలను విస్తరించాలన్న కోరిక కూడా కేసీఆర్‌కు బలంగా ఉంది. ఆయన కూడా 2024 తరువాత జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని అనుకుంటు-న్నారు. ఆయనకు అఖిలేష్‌తో కూడా అవసరం ఉంది రాజకీయ నిపుణులంటు-న్నారు. బలమైన ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఆ పార్టీ ఓటు- బ్యాంక్‌కి గండి కొట్టాలన్నది కేసీఆర్‌ ఎత్తుగడ అని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ ఇద్దరు నేతలు కలవడం మాత్రం జాతీయ రాజకీయాల్లో అతి పెద్ద చర్చకు దారితీస్తోందని చెప్పక తప్పదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement