Saturday, November 23, 2024

రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ – ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

కొత్తూరు, ఆగస్టు 3(ప్రభ న్యూస్): రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ అని, ఏడ్చిన ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించడంతో గురువారం కొత్తూరు మండల కేంద్రంలో కొత్తూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరై కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతు అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని అన్నారు. అందులో భాగంగానే మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరింపజేసి బోర్లను రీచార్జ్ చేశారని, చెరువులు నీటితో కళకళలాడేటట్టు చేశారని, చెరువుల ద్వారా ఎంతో మంది మత్స్యకారులు జీవనోపాధిని పొందుతున్నారన్నారు. రైతుబంధు ద్వారా రైతులకు అప్పుల బాధ తప్పిందన్నారు. రైతు బీమా ద్వారా కుటుంబ పెద్ద మృతి చెందితే ఆ కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని అందజేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్ , మున్సిపాలిటీ వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్, ఎంపీటీసీ రాజేందర్ గౌడ్, నాయకులు ఎమ్మే సత్యనారాయణ, జనార్దన్ చారి, బ్యాగరి యాదయ్య, మాధవరెడ్డి, సిటీ కేబుల్ వెంకటేష్, కర్రోళ్ల లక్ష్మయ్య , రవి నాయక్, శివకుమార్, రాఘవేందర్ యాదవ్, శివరాజ్, బండి శ్రావణ్, ఆంజనేయులు, శ్రీశైలం గౌడ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement