రైతన్నలు ఏడుస్తుంటే… ఢిల్లీలో రేవంత్ షికార్లు
లక్షల ఏకరాలలో పండ ఎండినా…
పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్
జనగామ, సూర్యాపేట, నల్గొండ
జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన కెసిఆర్
రైతుల ఆవేదనను పంచుకున్న మాజీ సిఎం
పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా…
రైతుల ఉసురు రేవంత్ సర్కార్ తగులుతుందన్న గులాబీ బాస్
జనగామ/సూర్యపేట : అన్నదాతకు అండగా నిలిచేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పొలంబాట పట్టారు. రైతుకు బాసటగా నిలిచేందుకు, కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నేటి ఉదయం జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధరావత్‌తండా లో పర్యటించారు.
దేవరుప్పుల మండలం ధర్మ గడ్డ తండాలో ఎండిన వరి పంట పొలాలను మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కెసిఆర్ తో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బండ ప్రకాష్ ఎమ్మెల్సీ రవీందర్ రావు క్యామ మల్లేశం తదితరులు కలిసి ఎండిన పంటలను పరిశీలించి రైతులు బానోతు వీర నాయక్ మాలోతు లక్ష్మణ్ గుగులోతు రాజమ్మ ఆంబోతు సత్తమ్మ పుల్సోతు ధరమ్ సింగ్ లతో ముచ్చటించారు.
సందర్భంగా ఆంబోతు సత్తమ్మ మాట్లాడుతూ 8 ఎకరాల వరి వేశానని సాగునీరు అందక ఆరు ఎకరాల పంట ఎండిపోయిందని గతంలో నాలుగు బోర్లు వేసి నష్టపోయామని ఇప్పుడు పంట చేతికి వస్తుందనుకుంటే ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురి పెండ్లి చేద్దామనుకున్నామని ఇలాంటి నష్టం ఎదురైందని మీరే ఆదుకోవాలని మీ ప్రభుత్వంలోనే సాగునీరు వచ్చిందని అన్నారు దీంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ పంట ఎండిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని తక్షణమే ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా రైతుల పక్షాన ఉండి పోరాడుతానని రైతులు అధైర్య పడద్దని అండగా ఉంటానని భరోసానిచ్చారు. అదేవిధంగా ఆంబోతు సత్తమ్మ కుమార్తె వివాహానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించేందుకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కు సూచించారు. ఎండిన పంటను పరిశీలించి రైతుల గోడును వినడం జరిగింది కానీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని మాట్లాడలేకపోతున్నానని కెసిఆర్ అన్నారు.
అనంతరం అక్కడి నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చేరుకున్నారు.. తుంగతుర్తితో పాటు అర్వపల్లి, సూర్యాపేట మండలంలో ఎండిన పంటలను పరిశీలించారు మాజీ సిఎం..రైతులతో ఆయన స్వయంగా మాట్లాడి పంటల పరిస్థితిని అడిగి తెలుసున్నారు.. ఏడేళ్లుగా ఒక్కసారి కూడా సాగునీరు ఇబ్బంది పడలేదని రైతులు కెసిఆర్ ముందు కన్నీరుమున్నీరయ్యారు.. పొట్టు మీదకు వచ్చిన పంటను నీరు లేక కాపాడుకోలేకపోతున్నామంటూ రైతుల గొల్లుమన్నారు.. భూగర్బ జలాలు సైతం అడగట్టడంతో బోర్లు వట్డిబోయాయని కెసిఆర్ కు రైతులు వివరించారు.
కనీసం పశువులకు కూడా నల్గొండ జిల్లాలో నీరు దొరకడం లేదన్నారు రైతన్నలు.. ఎండిన పంటపొలాలను చూస్తూ ఏడ్వడం తప్ప ఏమీ చేయలేకపోతున్నామంటూ అన్నదాతాలు బోరుమన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం తరుపున ఇంత వరకు ఒక్క నేత కూడా తమ వైపు చూడలేదని, సాగు నీరు అడిగితే వర్షాలు లేకపోతే మేం చేస్తామంటూ కాంగ్రెస్ నాయకులు అంటున్నారంటూ ఆరోపించారు.. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, రైతులకు అన్ని విధాల పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.. తమది రైతు ప్రభుత్వమని, అందుకే తమ ప్రభుత్వంలో రైతులందరూ రారాజుల బతికారన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మళ్లీ రైతుల బతుకులు మొదటికొచ్చాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు కెసిఆర్.
రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండి రైతన్న కన్నీళ్లు పెడుతుంటే.. కనీసం చీమ కుట్టినట్టయినా ఈ కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదంటూ మండి పడ్డారు..రైతులు ఏడుస్తుంటే ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ.. రాజకీయాలలో బిజీగా ఉన్న దుర్మార్గపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ గులాబీ బాస్ ధ్వజమెత్తారు.. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు.. ఎద్దు ఏడ్చిన రాజ్యం…రైతు కన్నీరు పెట్టిన రాష్ట్రం ఎన్నిటిక అభివృద్ధి చెందలేదన్నారు.. రైతుల ఉసురు రేవంత్ సర్కార్ కు తగులుతుందని అన్నారు కెసిఆర్ .. పార్టీ పరంగా రైతన్నలను ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు..
ఇది ఇలా ఉంటే నేటి ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బస్సులో రోడ్డు మార్గాన జనగామ జిల్లాకు బయల్దేరిన కేసీఆర్‌కు.. అడుగడుగా ప్రజలు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. బీఆర్‌ఎస్ అధినేతకు ధరావత్‌తండా వాసులు ఘనస్వాగతం పలికారు. అక్కడ రైతులను పరామర్శించిన కెసిఆర్ సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటించారు..
మధ్యాహ్నం ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్న కెసిఆర్ . అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు.. అక్కడే కొంత సేపు విశ్రాంతి తీసుకుని నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరుకు బయలు దేరారు.కేసీఆర్ వెంట ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి తదితరులు ఉన్నారు.