Tuesday, November 26, 2024

KCR Health Report – రెండు చోట్ల విరిగిన తుంటి ఎముక‌… నేడు స‌ర్జ‌రీ..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ఆయన పట్టుతప్పి కాలుజారి పడ్డారు. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసీఆర్ తుంటి ఎముక రెండు చోట్ల విరిగినట్టు వైద్యులు గుర్తించారు. నేడు ఆయనకు ఆపరేషన్ నిర్వహించనున్నారు. తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్లు అమర్చ‌నున్నారు.. ఈ స‌ర్జ‌రీ త‌ర్వాత కేసీఆర్ కోలుకోవడానికి 4 నుంచి 6 నెలల సమయం పట్టొచ్చని చెపుతున్నారు. మరోవైపు ఆసుపత్రిలో కేటీఆర్, హరీశ్ రావు, కవిత ఉన్నారు. కెసిఆర్ ఆరోగ్య ప‌రిస్థితిపై ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, ఆయ‌న త్వ‌ర‌లోనే కోలుకుంటారని కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement