Saturday, November 2, 2024

TS: తెలంగాణ ప్ర‌జ‌ల‌పై కేసీఆర్ కు ప్రేమ లేదు.. కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

మాజీ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలపై ఏ మాత్రం ప్రేమ లేద‌ని రాష్ట్ర‌ మంత్రి కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ… చేపలు, గొర్రెల పంపిణీని తాము అపహాస్యం చేయలేదని.. చేపలు, గొర్రెల పంపిణీ పేరిట రూ.వేల కోట్లు తిన్నారన్నారు. కేసీఆర్‌కు మంత్రి పదవి రాలేదనే తెలంగాణ ఉద్యమం చేపట్టారన్నారు. ఉద్యమ సమయంలో అమాయకులను రెచ్చగొట్టి చంపారన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తో భోజనం చేయాలంటే రూ.లక్ష ఇవ్వాలని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు సోనియాగాంధీకి రుణపడి ఉండాలని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం సోనియా గాంధీ కాళ్లు మొక్కారన్నారు. ఎల్లుండి తర్వాత బీఆర్ఎస్‌లో ఎవరూ ఉండరన్నారు. కేసీఆర్ పోయిన సంవత్సరమే దశాబ్ది ఉత్సవాలు చేశారన్నారు. మళ్లీ నిన్న దశాబ్ది ఉత్సవాలు మొదలు పెట్టారని సెటైర్లు వేశారు. ఉద్యమ సమయంలో అమాయకులను రెచ్చగొట్టి చంపారన్నారు.

ప్రపంచంలో వింత అని చెప్పిన మేడిగడ్డ మూడేళ్లలో కూలిపోయిందన్నారు. మేడిగడ్డకు మరమ్మతులు చేసినా గ్యారంటీ లేదని ఎన్డీఎస్‌ఏ నివేదిక ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ చేసిన రైతు రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని.. వందల ఎకరాలు ఉన్నవారికి కూడా రైతుబంధు వేశారన్నారు. 70వేల మంది టీచర్లు రిటైర్ అయినా డీఎస్సీ నిర్వహించలేదన్నారు. పంద్రాగస్టుకు రూ.2లక్షల రుణమాఫీ చేయబోతున్నామన్నారు. అధికారం పోయి.. బిడ్డ జైల్లో ఉందని కేసీఆర్ బాధలో ఉన్నారన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement