హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (భారాస) కేంద్ర కార్యాలయం (తెలంగా ణ భవన్) ప్రారంభానికి రం గం సిద్ధమైంది. ఢిల్లీ వసంత్ విహా ర్‌లో 1,150 చదరపు మీటర్ల స్థలంలో మొత్తం ఐదు అంత స్తు ల భవనాన్ని నిర్మించారు. ఈ నెల 4వ తేదీ గురువారం నూ తన కార్యాలయంలో భారాస అధినేత, తెలం గాణ సీఎం కేసీ ఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి లాంఛనంగా కార్యాల యా న్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు బుధవారం మధ్యా హ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ల నున్నట్టు- పార్టీ వర్గాలు తెలిపాయి. భారాస కార్యాలయ ప్రార ంభోత్సవ ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర రహదారులు, భవ నాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగి నపల్లి సంతోష్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు, కార్పొరేషన్ చైర్మన్లు ఢిల్లీ లోనే మకాం వేయగా మరి కొంతమంది మంత్రులు, ప్రజా ప్రతినిధులు మంగళవారం సాయంత్రం ఢిల్లీ బయ లుదేరి వెళ్లారు. గురువారం నుంచి భారాస జాతీయ కార్యక లాపా లన్నీ ఈ నూతన కార్యాలయం నుంచే నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. కా ర్యాలయంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పార్టీ నేతలు కూర్చుని సమావేశాలు, చర్చా గోష్ఠులు జరుపుకునే విధంగా సమావేశ మందిరాలు ఏర్పాటు- చేశారు. ఆయా రాష్ట్రాల భారాస అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాలకు చెందిన నేతలు ఢిల్లీ వచ్చిన సంద ర్భంలో మీడి యా సమావేశాలను జరిపేందుకు కూ డా ప్రత్యే క ఏర్పాట్లు- చేసినట్టు- సమాచారం. భారాస చీఫ్ కేసీఆర్ ఢిల్లీ వెళ్ళినప్పుడు పార్టీ జాతీయ నేతలు వివిధ రాష్ట్రాలకు చెం దిన భావ సారూ ప్యత గల పార్టీల నేత లతో సమాలోచనలు జరు పుకునేందు కు వీలుగా ప్రత్యేక సమావేశ మందిరాన్ని ఏర్పాటు- చేశారు.
నూతన కార్యాలయంలో కేసీఆర్ కోసం ప్రత్యేక గది
ఢిల్లీ కొత్తగా ప్రారంభిస్తున్న భారాస జాతీయ కార్యాల యంలో అధ్యక్షుడికి ప్రత్యేకంగా గదిని సిద్ధం చేశారు. కార్యా లయ ప్రారంభానికి బుధవారం ఒక్కరోజే గడువు ఉండ టం తో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ పనులను వేగవంతం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం కేసీ ఆర్ కోసం ప్రత్యేక గదితో పాటు- మొత్తం 18 రూమ్‌లు, కాన్ఫ రెన్స్ హాలు ఉండేలా నిర్మించారు. అతిథుల కోసం రెండు సూట్ రూమ్‌లు కేటాయించారు. వివిధ కార్యక్రమాలు, పను ల నిమిత్తం పార్టీ కార్యాలయానికి వచ్చే వారి కోసం ప్రత్యే కంగా క్యాంటీ-న్ సౌకర్యం ఏర్పాటు- చేశారు.
రేపే తెలంగాణ భవన్ ప్రారంభోత్సవం
ఈ నెల 4 గురువారం సుమూహర్తం ఉండటంతో అదే రోజు పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి బీఆర్‌ఎస్ శ్రేణు లు ఏర్పాట్లు- చేస్తున్నారు. 4వ తేదీ మధ్యాహ్నం 1.05 గంట లకు ముహూ ర్తం ఖరారు చేశారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వసం త్ విహార్‌లోని కార్యాలయానికి చేరుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన ను న్నట్లు- పార్టీ వర్గాలు తెలిపాయి. పండితులు హోమం, వాస్తు పూజలు నిర్వహించనున్నారు. ప్రారం భోత్సవం అనం తర ం.. సుమారు గంట సేపు కొత్తగా నిర్మించిన కార్యాలయంలో సీఎం కేసీ ఆర్ గడపనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్య క్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలతో పాటు- ఢిల్లీ నగరానికి చెందిన భారాస కీలక నేతలు, ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు, ముఖ్యులకు ఆహ్వా నాలు పంపించినట్టు- సమాచారం.
కేజ్రీవాల్, భగవంత్ మాన్‌కు ఆహ్వానం
ఢిల్లీలో నిర్మించిన భారాస జాతీయ కార్యాలయం ప్రారంభ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌లను ఆహ్వానించినట్టు- ప్రచారం జరుగుతోంది. రైతు సంఘాల జాతీయ నేతలతో పాటు- పలువురు రాజ్యాంగ, ఆర్థిక రంగ నిపుణులు, విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారు లను కూడా ఈ కార్యాలయ ప్రారంభ కార్యక్రమానికి పిలిచినట్టు- పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మంగళవారం టూర్ వాయిదా
బీఆర్‌ఎస్ కార్యాలయంలో ప్రారంభోత్సవం కార్యక్ర మంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ మంగళవారం సాయ ంత్రమే హైదరాబాద్ నుంచి ఢిల్లిdకి బయల్దేరి వెళ్లాల్సి ఉండగా ఈ పర్యటన వాయిదా పడింది. రెండు రోజులుగా భారీ వర్షా లు కురుస్తుండటం, రైతాంగం పంట చేతికొచ్చే సమయంలో తీవ్రంగా నష్టపోతుండటంతో చివరి క్షణంలో సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా వేసుకున్నారు. రైతులను ఆదుకునే లక్ష్యం తో పర్యటన వాయిదా వేసుకున్నట్లు అధికార వర్గాల సమా చారం. ఈ నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో యాసంగి వరి ధాన్యం సేకరణ,అకాల వర్షా లు, రైతుల ఇక్కట్లు, నష్ట నివారణ చర్యలపై ఉన్నతస్థాయిలో సమీక్షించారు.