ఆసిఫాబాద్: పోడు భూములకు పట్టాలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్ అనంతరం జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ, ఉమ్మడి అదిలాబాద్ కు వరాలు కురిపించారు..కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు సీఎం నిధి నుంచి మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆసిఫాబాద్‌లోని 335 గ్రామ పంచాయతీలకు రూ.10లక్షల చొప్పున సాయం ప్రకటించారు. వార్ధా నదిపై వంతెన కావాలని, ఐటీఐ కావాలని ఇక్కడి ప్రజలు కోరారని.. వీటిని ఇప్పుడే మంజూరు చేస్తున్నామన్నారు. నాగమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ తెలిపారు
వార్ధా నది నీళ్లు వ్యయసాయ అవసరాలకు వినియోగించేలా నీటి ప్రాజెక్ట్ లు కడుతున్నామని, త్వరలోనే గిరిజన వాసులకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.. అలాగే గిరిజన ప్రాంతాలలో బోరు బావులపై వ్యవసాయం చేసే రైతులకు త్వరలోనే త్రీ పేజ్ కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు.. తెలంగాణలో అమలవుతున్న పథకాలు కావాలని పొరుగునే ఉన్న మహారాష్ట్ర వాళ్లు కోరుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు.