ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు నేడు హాజరుకానున్నారు. ఈడీ విచారణకు వెళ్లాలని కవితకు సీఎం కేసీఆర్, సోదరుడు, మంత్రి కేటీఆర్ కూడా సూచించినట్లు సమాచారం. సుప్రీంకోర్టులో తన పిటిషన్ పై ఈ నెల 24న జరగనున్న విచారణ వరకు వేచి ఉండాలని కవిత భావిస్తోంది. హాజరు కాకపోయినా..విచారణకు సహకరించడం లేదని ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని..కొంత మంది న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు కవిత విచారణ హాజరు అవుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈడీ విచారణకు హాజరుకావాలని కవితకు నోటీసులు జారీ చేశారు. ఈనెల 11న మొదటిసారి ఈడీ విచారణకు హాజరైన కవిత రెండోసారి ఈ నెల 16న గైర్హాజరైన విషయం తెలిసిందే.. ఇది ఇలా ఉంటే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసుల మేరకు మరోసారి కవిత ఆదివారం రాత్రే ఢిల్లీకి వచ్చారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో భర్త అనిల్, సోదరుడు, మంత్రి కేటీఆర్, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్, వద్దిరాజు రవిచంద్ర, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, పలువురు న్యాయవాదులతో కలిసి కవిత ఢిల్లీకి చేరుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement