Tuesday, November 19, 2024

MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ కస్టడీలో ఉన్న కవిత తనకు ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. గత ఏడాది మార్చి 14న కవిత రిట్ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో ఈరోజు వాదనల సందర్భంగా కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి తన వాదనలను వినిపిస్తూ… రిట్ పిటిషన్ పై విచారణ అవసరం లేనందున పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నామని తెలిపారు.

దీంతో, పిటిషన్ ను వెనక్కి తీసుకునేందుకు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం అంగీకరించింది. మరోవైపు, కవితను ఈడీ అరెస్ట్ చేయడం అక్రమమంటూ దాఖలైన మరో పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement