ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి, నిజాబామాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అనంతరం మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మరోసారి ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు కవిత.
అన్ని పార్టీల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు గమనించి, పోటీ లేకుండా టీఆర్ఎస్ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించారు. ఎన్నికలలో సహకరించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అన్నారు కల్వకుంట్ల కవిత.
కాగా, ఎమ్మెల్సీ గా ఎన్నికైన కవితకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి. ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించిన అన్ని పార్టీల జెడ్పీటీసీలు, ఎంపీటీసీ, కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అభివృద్ధిలో ఎమ్మెల్సీ కవిత ముఖ్య పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.