డిల్లీ – ఎమ్మెల్సీ కవిత రేపు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులపై సుప్రీంకోర్డును ఆమె ఆశ్రయించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవవచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఒక మహిళను ఈడీ విచారణకు పిలుస్తోందని ఇది పూర్తిగా చట్టానికి విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కవిత తరుఫు లాయర్ వివరించారు. అయితే ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం మార్చి 24కు వాయిదా వేస్తూ. ఈడి విచారణపై ఎటువంటి స్టే ఇవ్వలేమని కోర్టు వెల్లడించింది. కవితకు మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement