న్యూఢిల్లీ/ హైదరాబాద్ – మహిళల విచారణపై ఈడీకి తగిన మార్గదర్శకాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ ఈ నెల 27వ తేదిన చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.. వాస్తవానికి ఈ పిటిషన్ పై ఈ నెల 24న కాకుండా ఈ నెల 27న సుప్రీం కోర్టులో విచారణ జరగవలసి ఉంది.. ఈ పిటీషన్‌పై న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, బేలా త్రివేదీల ధర్మాసనం విచారణ జరపనుంది. కవిత పిటిషన్‌పై ఈనెల 24వ తేదీనే విచారిస్తామంటూ మొదట తెలిపిన సిజెఐ ధర్మాసనం ఆ తర్వాత 27వ తేదీకి మార్చింది…కాగా, సంచలనం కలిగిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఇప్పటికే మూడుసార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారుల ముందు హాజరయ్యారు… ఈ నెల 11, 20, 21 తేదీల్లో ఆమె మూడుసార్లు ఈడీ ఎదుట హాజరైన కవిత వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా తన వద్ద ఉన్న 10 ఫోన్లను ఈడీ అధికారులకు అప్పగించారు. కీలక పత్రాలు కూడా సమర్పించారు. అలాగే ఇకపై విచారణకు తాను కాకుండా తన తరుపు న్యాయవాది హాజరయ్యే విధంగా అనుమతి ఇవ్వాలని కోరుతూ అందుకు అవసరమైన డాక్యుమెంట్లను కవిత ఈడీ అధికారులకు అందజేశారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement