దిల్లీ – ఢిల్లీ మద్యం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో మరోసారి ఈడీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరయ్యారు. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఈడీ అధికారులు 10 గంటల పాటు ప్రశ్నించారు. ఉదయం 10 గంటలకు ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన కవిత రాత్రి 9.14 నిమిషాలకు బయటకు వచ్చారు.. అక్కడ నుంచి నేరుగా ఆమె కెసిఆర్ నివాసానికి బయలుదేరి వెళ్లారు..
ఢిల్లీ, హైదరాబాద్ సమావేశాల్లో చర్చించిన అంశాలపై ఈడీ అధికారులు ఆమెపై ప్రశ్నలు వేసినట్లు సమాచారం . ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా, అరుణ్ రామచంద్రపిళ్లై, అమీత్ ఆరోరాలలతో కలిపి కవితను ముఖాముఖి ఈడీ అధికారులు విచారించారని వార్తలు వినవస్తున్నాయి… ఉదయం రామచంద్రపిళ్లైతో కలిసి విచారించిన ఈడీ అధికారులు మధ్యాహ్నం నుంచి మనీష్ సిసోడియా, అమిత్ ఆరోరాలతో ముఖాముఖి విచారణ జరిపినట్లు సమాచారం..
10 గంటల పాటు కవితపై ప్రశ్నల వర్షం… ముగిసిన ఈడీ విచారణ.. వీడియోతో
Advertisement
తాజా వార్తలు
Advertisement