Tuesday, November 26, 2024

ఎల్ ఐ సి పెట్టుబ‌డులు అవిరి అవుతుంటే మౌన‌మేల – ప్ర‌ధానిని నిల‌దీసిన క‌విత‌

హైద‌రాబాద్ – దేశ అర్ధిక వ్య‌వ‌స్థ‌ను కుదిపేస్తున్న బిజినెస్ టైకూన్ అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేంద్రానికి ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజల పైసలతో ఆటలా? అని ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. ఎల్ఐసీ పెట్టుబడులు ఆవిరవుతుంటే మౌనం ఎందుకు? అని ఫైర్ అయ్యారు. సీబీఐ, ఈడీ రాజకీయ ప్రయోజనాల కోసమేనా మౌనం? అని ధ్వజమెత్తారు. ప్రజల డబ్బులతో ఆటలాడటం ఎంతవరకు సమంజసం అని అన్నారు. అదాని వ్యవహారంపై వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు వేయాలని కవిత డిమాండ్ చేశారు.

ఎల్ఐసీలో పెట్టుబడులు పెట్టిన ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ట్విటర్‌లో ప్రశ్నించారు. అదానీ కంపెనీల్లో ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడుల విలువ 11 శాతం మేర పడిపోవడం పట్ల కవిత స్పందించారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానకిి ట్విట్టర్‌లో ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగి దాదాపు రూ.12 లక్షల కోట్లు నష్టపోయాయని అన్నారు. అయినా సీబీఐ, ఈడీ, రిజర్వ్ బ్యాంకు వంటి సంస్థలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని నిలదీశారు. ఆ సంస్థలను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించుకుంటారా అని మండిపడ్డారు.

అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌ రిపోర్ట్‌ బహిర్గతం అయినప్పటి నుంచి అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. దీనిపై కేంద్రం స్పందించి.. జేపీసీ ఏర్పాటు చేసి ఉంటే ప్రజలు నష్టపోయేవారు కాదని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలని కోరారు. జేపీసీని నియమించాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement