నిజామాబాద్ సిటీ, ఆగస్ట్ (ప్రభ న్యూస్)7: కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. దేశానికి మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు చేసిన సేవలను మరచి పోవడమే కాకుండా మరిపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని ధ్వజమెత్తారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను సమూలం గా మార్చి గాడిలో పెట్టిన మహోన్నత వ్యక్తి పీవీ అని కొనియాడారు.సోమవారం జిల్లాలోని బోర్గాం పి ప్రాంతంలో నిజామాబాద్ లో బ్రాహ్మణ సమాజం ఏర్పాటు చేసిన పీవీ నరసింహారావు విగ్రహాన్ని పీవీ కుమార్తె , ఎమ్మెల్సీ వాణి దేవి, కుమారుడు ప్రభాకర్ రావు తో కలిసి కల్వకుంట్ల కవిత ఆవి ష్కరించారు . ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ….కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాల వల్ల దేశ ఆర్థిక పరిస్థితీ లో మొత్తం కుధేలైన సందర్భంలో పీవీ నరసింహా రావు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు. విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్న బంగారం కుదవపెట్టి అన్నమోరామచంద్ర అనుకుంటున్న క్లిష్టసమయంలో ప్రధాని అయిన పీవీ కేవలం తన మేధో సంపత్తితో ఆలోచన చేసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని వివరించారు. ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా నియమించుకొని కొత్త ప్రయోగాలకు పూనుకున్నారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళజాతి కంపెనీల నుంచి పెట్టుబడులు ఆకర్శించేందుకు ధైర్యంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఆనాడు పీవీ తీసుకున్న చర్యల వల్ల ఈ రోజు లక్షలాది మంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయని, కోట్లాది కుటుంబాలు దారిద్ర్య రేఖ నుంచి పైకి ఎగబాకాయన్న విషయం భారత దేశంలో ఎప్పటికీ మర్పిపోదని స్పష్టం చేశారు.
కానీ అటుంవటి విషయన్ని కూడా మరిచి పోయి మరిపించే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందని ఆరోపిం చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిడ్డను గుర్తించకపోతే సీఎం కేసీఆర్ పట్టుదలతో శతజయంతి ఉత్సవాలను నిర్వహించారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా శతజయంతి ఉత్సవాలు జరిగాయని, పీవీ ఆలోచనా విధానాన్ని ఒక ఉద్యమంలా ప్రతీ తెలంగాణ బిడ్డ గుండెకు తట్టేలా చాటిచెబుతామని, ప్రపంచానికి పీవీ స్పూర్తిని పంచుతామని అన్నారు. పీవీ నరసింహా రావు విగ్రహం ఏర్పాటుతో నిజామాబాద్ కు కొత్త కళ వచ్చిందన్నారు. తెలంగాణ నుంచి ఎదిగి దేశానికి ఎంత సేవ చేశారో అందరికీ తెలుస్తుందని, నూతన ఉత్సాహం వస్తుందని చెప్పారు. పీవీ నరసింహా రావు అది చేశారు ఇది చేశారు అని మాట్లాడూ ఉంటే… మనం చేయాల్సిందే ఇంకా చాలా ఉంది అన్న బాధ్యతను ఈ సమావేశం గుర్తు చేసిందని అన్నారు.
సహజంగా తెలంగాణ వాళ్లు చేసింది చెప్పుకోడానికి కొంత తటపటాయిస్తారని, పీవీ నరసింహా రావు కూడా అంతేనన్నారు. పీవీ 14 భాషల్లో మాట్లాడడం అంటే మామూలు మేధో సంపత్తికా దని కొనియాడారు. అంత మేధో సంపత్తి ఉన్న సరే పట్వారిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో దేశ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు అలానే ఉన్నాయ న్నారు. ఆహార్యంలో కూడా ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు. కొంత మంది అకస్మాత్తుగా సర్పంచ్, ఎంపీటీసీ అయినవాళ్లు గల్లా ఎగరేసి నల్లకళ్లద్దాలు పెట్టుకొని అప్పటి వరకు చెప్పులు వేసుకునే వాళ్లు షూస్ వేసుకొని అన్న అన్న అనేవాళ్లు ఏం రా అనే వరకు వస్తుంది పరిస్థితి అని సీఎం అప్పుడప్పుడు చెబుతుండేవారని చెప్పారు. పదవి వస్తే ఉప్పొంగిపోవద్దని, పదవి ఎదిగినా కొద్దీ ప్రజల తలలో నాలికలా ఉండి ప్రజల బాధలను తెలుసుకోవాలని సీఎం కేసీఆర్ చెబుతుంటారన్నారు. పీవీ నరసింహా రావు వంటి నాయకత్వపు లక్షణాలు అందరికీ రావాలని కోరుకుంటు న్నానన్నారు.
కేంద్రంలో విద్యా శాఖ మంత్రిత్వ శాఖను మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖగా మార్చి అత్యద్భుతమైన కొత్త పద్ధతులను ప్రవేశపెట్టారని తెలిపారు. పీవీ నరసింహా రావు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటి సాంఘీక సంక్షేమ పాఠశాలలను సర్వేల్ లో ప్రారంభించారని గుర్తు చేశారు. ఆ స్పూర్తితో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా దేశవ్యాప్తంగా నవోదయా విద్యాలయాలను పాఠశాలలను ఏర్పాటు చేశారని, దాంతో లక్షాలాది మంది మేధావులు తయారయ్యారని చెప్పారు. దేశంలో లక్షాలది మందికి తెలంగాణ బిడ్డచేత చదువు ప్రారంభమయ్యిందంటే మనందరం గర్వపడాలన్నారు.
పీవీకి 65 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత దేశానికి కంప్యూటర్లు వస్తే తన కోసం, తాను పది మందికి పనికి రావడం కోసం కంప్యూటర్ వాడకాన్ని నేర్చుకున్నారని కొనియాడారు. సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇలా ఎవ్వరిదీ చిన్న పదవి కాదని, సమాజాంలో అందరికీ పాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. నిబద్ధతతో పనిచేస్తూ పోతే కచ్చితంగా అవకాశాలు వస్తాయన్న నమ్మకంతో ముందుకుసాగితే పీవీ నరసింహా రావు స్థాయికి ఎవరైనా చేరుకుంటామన్న విశ్వాసం తనకు ఉందని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత, పివినరసిం హారావు కొడుకు పివి ప్రభాకర్, కూతురు ఎమ్మెల్సీ సురభి వాణిలు పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత పీవీ నరసింహారావు దే – అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బీగాల
ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువచ్చి, ఐటీ రంగాల్లో, అన్ని రంగాలను తీసుకువచ్చిన ఘనత మాజీ ప్రధాని నరసింహా రావు దే నని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బీగాల అన్నారు.చాలా రోజుల నుంచి పి. వి నరసింహ రావ్ విగ్రహ స్థల సేకరణ కోసం భూపతిరావు కోరడం జరిగిం దని అన్నారు. పీ వీ నరసిం హారావు మంథని లో ఎమ్మెల్యే, హైదరాబాదులో ఎంపీ గా, రాయలసీమ లోని నంద్యాల లో ఎన్నిక కావడం అంటే మా టలు కాదని అన్నారు.అప్పుడు నరసింహారావు సాధ్యమైందని ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే సాధ్యమైందని అన్నారు. పివీ నరసింహారావు రిటైర్డ్ అవుదామని అనుకున్న సందర్భంలో అప్పటి ప్రధానీ రాజీవ్ గాంధీ మరణిస్తే వారు కూడా ఎమర్జెన్సీ వాతావరణం నెలకొనడంతో అప్పుడు ప్రధానీ కావాలంటే సమర్థుడు పీవీ నరసింహారావు ఒక్కడే ఉన్నారని గుర్తించడం జరిగింది అన్నారు. రిటైర్మెంట్ అయిన దేశానికి మీరు అవసరం ఉందని ఢిల్లీకి తీసుకొని జరిగిందన్నారు.మైనార్టీ లో ఉన్న ప్రభుత్వాన్ని మెజార్టీలోకి తీసుకువచ్చిన ఘనత పివీ నరసింహారావు గారిదేనని అన్నారు.
నిజామాబాద్ జిల్లాలోని బోర్గాం (పి )చౌరస్తా వద్ద భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పివినరసింహారావు కొడుకు పివి ప్రభాకర్ రావు, కూతురు ఎమ్మెల్సీ సురభి వాణి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠల్‌రావు, బి ఆర్ యస్ నాయకులు మహేష్ బిగల , మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ , టీఎస్ డబ్ల్యూ సిడిసి చైర్మన్ ఆకుల లలిత , జిల్లా పరిషత్ చైర్మన్ రాజన్న గారి విట్టల్, ఉమెన్స్ కమిషన్ సభ్యురాలు సుదం లక్ష్మి, రాష్ట్ర ఐటీ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల, మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఈగ సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు బాజీరెడ్డి జగన్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బిఆర్ ఎస్ నాయకురాలు మాజీ కార్పొరేటర్ చాంగు భాయ్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు అధ్యక్షులు కిరణ్ కుమార్, దేశముఖ్,గౌరవ అధ్యక్షులు: కంజర్ కర్ భూపతిరావ్ , ప్రధాన కార్యదర్శి రొట్టె సురేష్ శర్మ, కోశాధికారి రమేష్ కులకర్ణి (పుల్కల్), ఉపాధ్యక్షులు కరుణశ్రీ, ఉదయ్, శశికాంత్, పురుషోత్తం ఆధ్యా త్మిక సలహాదారు వేలేటి గౌరీశంకర్ శర్మ,కార్యనిర్వాహక కార్యదర్శులు: విశ్వనాథ్ రావ్ కులకర్ణి, రాజకాంత్ రావు కులకర్ణి , మల్లికార్జున రావు మంజుల,గౌరవ సలహాదారులు అప్పాల కిష్టయ్య, ప్రాణేశ్వర్ రావు, జగపతి రావు, చంద్రశేఖర్, సహాయ కార్యదర్శులు మేడిచర్ల శ్రీనాథ్, ప్రకాష్ కులకర్ణి ,గోవిందరావు దేశ్ ముక్, పురుషోత్తం, సౌమ్య భరద్వాజ్ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు