Sunday, November 3, 2024

TS: లిక్కర్ కేసులో కవిత నిందితురాలే.. తాజాగా సీబీఐ నోటీసులు

లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు తీసుకుంది. ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా పరిగణిస్తూ కేసులో సీబీఐ ఆమె పేరును చేర్చింది. ఈ మేరకు కవితకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న ఢిల్లీలోని సీబీఐ ఆఫీసుకు విచారణకు రావాలని నోటీసులలో స్పష్టంగా పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే కవితను ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

ఈడీ తనను విచారించడంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. విచారణ పూర్తయ్యే వరకు కవితపై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, పార్లమెంట్ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరోసారి నోటీసులు రావడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement