Friday, November 22, 2024

వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం

కరీంనగర్ పట్టణంలోని నాకా చౌరస్తాలో వైఎస్సార్‌ 73వ జయంతి వేడుకలను, వైఎస్సార్ తెలంగాణ పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పట్టణ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు సాదిక్ బలాల ఆధ్వర్యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, కేక్ కట్ చేసి పళ్ళు పంపిణీ చేశారు. అనంత‌రం వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండా ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేసుకుని ఉత్సవాలను జ‌రుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్, అధికార రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నగేష్, రాష్ట్ర నాయకులు కంది వెంకటరమణారెడ్డి, మహమ్మద్ సలీం, గండి శ్యామ్, బైరి శ్రీనివాసరెడ్డి, ఇప్పనపల్లి శేఖర్, వెన్నం రజిత రెడ్డి, పోలు శ్రీనివాస్, సాన రాజన్న, జావీద్, రవీందర్ రెడ్డి, రోళ్ళ కవిత, రోల్ల శ్రీనివాస్, సుంకరి సునీల్ పటేల్, కొమ్ము ఆంజనేయులు గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చేసినటువంటి సేవలను కొనియాడారు. ఈరోజు సంక్షేమం అనేది రెండు రాష్ట్రాల్లో జరుగుతుందంటే అది వైఎస్సార్ ప్రారంభించిన నాటి నుండి అని ఈరోజు వరకు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ 108 ఇలాంటి ఎన్నో పథకాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా వాటిని కదిలించలేని పరిస్థితుల్లో ఉన్నారంటే ఆ ఆనాటి సంక్షేమం ఎలా ఉండేదో ఆ సంక్షేమానికి ప్రజలు ఎంత వరకు లబ్ధి పొందారు అర్థమవుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement