స్వర్గీయ తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య జయశంకర్ సేవలు చిరస్మరణీయమని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా నగరంలోని టవర్ సర్కిల్ ఏరియాలో గల జయశంకర్ విగ్రహానికి నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మహా ఉద్యమానికి జయశంకర్ మార్గదర్శకులుగా నిలిచారన్నారు. రాష్ట్రంలోని యువత జయశంకర్ ను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేయాలన్నారు. నేటి యువత జయశంకర్ సార్ ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు స్థానికులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement