పోలీస్ అధికారులు, సిబ్బంది జవాబుదారితనంతో పని చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం పెద్దపెల్లి పోలీస్ స్టేషన్, సిఐ కార్యాలయం, ఏసీపి కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు సమస్యలతో పోలీస్ స్టేషన్కు వస్తుంటారని త్వరిత గతిన వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. 5 ఎస్ ఖచ్చితంగా అమలు చేయాలని, స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో డిసిపి అఖిల్ మహాజన్, ఏసిపి సారంగపాణి, సిఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ రాజేష్ తో పాటు పలువు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement