సృష్టికి మూలం మహిళ అని పెద్దపల్లి ఏసిపి సారంగపాణి పేర్కొన్నారు. మంగళవారం జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సబ్ డివిజన్ పరిధిలోని మహిళా అధికారులు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లింగ భేదం అనేది మహిళా ఉద్యోగులు మరచిపోవాలన్నారు. ప్రస్తుతం మహిళా పోలీసుల అవసరం పెరిగిందని, ఏ బందోబస్తు అయినా మహిళా పోలీసులు లేకుండా చేయలేని పరిస్థితి వచ్చిందన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసి మహిళా సిబ్బందికి సముచిత స్థానం ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీలో 33 శాతం మహిళా రిజర్వేషన్ కల్పిస్తున్నారన్నారు. దీంతో పోలీసు శాఖలో మహిళలు పెద్ద ఎత్తున ఉద్యోగాలు పొందారన్నారు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని, 1975 నుండి మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏడాది మార్చి 8న జరుపుకుంటున్నారన్నారు. స్త్రీ శక్తి అత్యంత గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ లు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ లు రాజేష్, రాజవర్దన్, సహదేవ్ సింఘ్, శివాని, మౌనిక, వినిత, అశ్విని, తో పాటు మహిళా సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement