మల్యాల, మార్చి 23 (ప్రభ న్యూస్): సీఐడీ డీజీపీ మహేశ్ భగవత్ చొరవతో వలస కార్మికులకు విముక్తి లభించింది. ట్విట్టర్‌లో చేసిన పోస్టుకు స్పందించిన సీఐడీ డీజీపీ ఆదేశాల మేరకు కరీంనగర్ సీఐడీ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మల్యాల మండలం పోతారంలో గల ఇటుక బట్టీలలో నిర్భంధంలో ఉన్న 13 మంది ఒడిశా కార్మికులను వారి స్వగ్రామాలకు తరలించారు. ఒడిశా రాష్ట్రంలోని బొలాంగూర్ జిల్లాకు చెందిన బానబస్ కేటకి, ఉపేంద్ర సాగడి, జితేంద్ర తంది, ఉపేంద్ర తంది, బినోడ్ తంది, కాశిక సాగర్ సిక, గుణపతిక సిక, ధనమతి, రజనీ కేటకి, లిల్లి కేటకి, గీత తంది, ఛ్చాబిలా సిల, రమణి సికలకు స్థానిక పోలీసుల సహకారంతో ఇటుక బట్టీల నుంచి విముక్తి కల్పించారు. బాధితులను వారి వారి స్వస్థలాలకు పంపించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement