Saturday, November 23, 2024

పొలానికి తడి.. కూలీకి ఉపాధి .. ఎమ్మెల్యే దాసరి

కాలువల్లో పూడిక తీత వల్ల పొలానికి తడి.. కూలీలకు ఉపాధి లభిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామంలో జనహితం జలహితం కార్యక్రమాల్లో భాగంగా ఉపాధి హామీ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో సాగునీరు వృధా కాకుండా కాలువల్లో పూడిక తీసే బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. 2వ విడత జలహితం-జనహితం కార్యక్రమం పెద్దపల్లి నియోజకవర్గంలో చురుగ్గా సాగుతుందన్నారు. ఎస్ఆర్ఎస్పి కాలువలో పూడికతీతతో పాటు పిచ్చి చెట్లను తొలగించడం వల్ల సాగునీరు వృధా కాకుండా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీ రావు, సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ సంపత్, అధికారులు, రైతులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement