Tuesday, November 26, 2024

సీఎం కేసీఆర్ వల్లే సంచార జాతుల సంక్షేమం: పూసల సంఘం

పెద్దపల్లి (ప్రభా న్యూస్) : పెద్దపల్లి పట్టణంలోని అమర్ నగర్ చౌరాస్తాలో కెసిఆర్ చిత్ర పటానికి పూసల సంఘ సభ్యులు పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ తెలంగాణ పూసల సంఘంను గుర్తించి ఉప్పల్ భాగాయత్ ఒక ఎకరా భూమి మరియు కోటి రూపాయలను ఫండ్ కేటాయించడం జరిగిందని, దానికి సంతోషించిన పూసల కులస్థులం గౌరవ కెసిఆర్ గారికి మా సంఘం తరఫున పాలాభిషేకం చేస్తూ, పాదాభివందనం చేస్తున్నామని తెలంగాణ పూసల సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ గుడ్ల సమ్మయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంచారజాతులలో 35 కులాలను గుర్తించి, వారికి హైదరాబాద్ లో ఆత్మ గౌరవ భవనాలను ఏర్పాటు చేసుకునేందుకు భూమి మరియు ఫండ్ ఏర్పాట్లు చేసిన సీఎం కేసీఆర్ కు ఎల్లవేళలా మేము రుణపడి ఉంటామన్నారు. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వం ఏర్పడినా కానీ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ సంచారజాతుల గుర్తించలేదని, తెలంగాణ ఏర్పడిన తర్వాతనే కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సంచార జాతులు వారి స్థితిగతులు ఏమిటి, వారి అభివృద్ధి కోసం ఏ ఏ కార్యక్రమాలు చేయాలి అని ఆలోచించి అన్నింటిని ఒకే తాటిపైకి తీసుకువచ్చి, వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించారని పేర్కొన్నారు.

జిల్లా అధ్యక్షులు పొదిరి కుమార స్వామి మాట్లాడుతూ పెద్దపల్లిలో సంఘ భవనానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి 5 లక్షల రూపాయలు, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ 3 లక్షలు కేటాయించారని, ఇంకను కేటాయిస్తామని మాట ఇచ్చారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెరాసా పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, జిల్లా అధ్యక్షులు పొదిల్ల కుమార స్వామి, ప్రధాన కార్యదర్శి ముద్రకోల తిరుపతి, కోశాధికారి సదానందం, వర్కింగ్ ప్రెసిడెంట్ కిషన్, వైస్ ప్రెసిడెంట్ పట్టేం నర్సయ్య లతో పాటు పట్టణ అధ్యక్షుడు చెని కేశవులు, కోశాధికారి సతీష్, గౌరవ అధ్యక్షుడు ముద్రకోలా రాజయ్య, ప్రధాన కార్యదర్శి కోనేటి శ్రీనివాస్ లతో పాటు పలువురు పూసలు కులస్తులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement