Tuesday, November 26, 2024

Peddapalli: సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యం… ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి రూరల్, (ప్రభ న్యూస్) : సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యమని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. గడపగడపకు ప్రచారంలో భాగంగా పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. నిరుపేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. గత తొమ్మిదిన్నర ఏళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారని ప్రజలు మరోసారి ప్రతిపక్షాలను నమ్మి ఓటు వేస్తారన్నారు. గత పాలకులు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నిరుపేదల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు.

తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, బతుకమ్మ చీరల పంపిణీ లాంటి ఒక్క కార్యక్రమమైనా ఏదైనా రాష్ట్రంలో ఉన్నాయో ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న నాడు 200 రూపాయల పింఛన్ ఇస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేలకు పెంచారన్నారు. దివ్యాంగుల పెన్షన్ 4 వేలకు పెంచామని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ వెయ్యికి మించి పింఛన్ ఇవ్వడం లేదని, అధికారం కోసం దొంగ హామీలు ఇస్తున్నారన్నారు. ఆరు గ్యారెంటీలు 60 గ్యారంటీలు అని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గత రెండు పర్యాయాలు ఆదరించిన విధంగానే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మద్దతు ఇవ్వాలని కోరారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతిశ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు కొంకటి తిరుపతి, రైతు సమితి గ్రామ కో ఆర్డినేటర్ మేకల రాజేశం, మాజీ సర్పంచ్ బొల్లం తిరుపతి, అశోక్, చిప్ప భాస్కర్, జంగిలి లింగయ్య, వేల్పుగొండ కొమురయ్య, గాండ్ల వెంకన్న, పిడుగు కిషోర్, పిడుగు హరీష్, వేల్పుగొండ అనిల్, మేకల రాజయ్య, రాయలింగు, నీలి శ్రీకాంత్, పిడుగు సంపత్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement