Friday, November 22, 2024

Peddapalli: ప్రతి ఇంటికి సంక్షేమం.. చైర్ పర్సన్ మమత

తెలంగాణలోని ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి తెలియజేశారు. బుధవారం ఇంటింటి ప్రచారంలో భాగంగా పట్టణంలోని 22వ వార్డులో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పట్టణంలో జరిగిన అభివృద్ధిని వివరించడంతో పాటు బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రతిని అందజేశారు.

అనంతరం మాట్లాడుతూ… గత పాలకులు పట్టించుకోకపోవడం వల్లే పెద్దపల్లి అభివృద్ధి చెందలేదన్నారు. గత తొమ్మిదిన్నర ఏళ్లలో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి 40ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపారన్నారు. పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో పాటు జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిందన్నారు. మినీ ట్యాంక్ బండ్ అద్భుతంగా నిర్మించుకున్నామని, బోట్ సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు. పట్టణంలో రోడ్ల విస్తరణ, సెంటర్ లైటింగ్, డివైడర్లను నిర్మించామన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి దాసరి మనోహర్ రెడ్డిని మూడోసారి అసెంబ్లీకి పంపించాలని కోరారు. కాంగ్రెస్ దొంగ హామీలు నమ్మవద్దని, అధికారం కోసం అసత్యపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి బుద్ధి చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. పట్టణ అభివృద్ధిలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పు రాజుతో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement