Friday, November 22, 2024

మాస్కులు ధరించకుంటే కఠినచర్యలు

పెద్దపల్లిరూరల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకు బయటి ప్రాంతాల్లో సంచరించే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, లేకుంటే కఠినచర్యలు తప్పవని పెద్దపల్లి ఎస్‌ఐలు రాజేశ్‌, సహదేవ్‌సింగ్‌లు హెచ్చరించారు. సోమవారం జిల్లా కేంద్రంలో జెండా చౌరస్తా వద్ద ఎస్‌ఐ సహదేవ్‌సింగ్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. మాస్కులు ధరించకుంటే తిరిగే వారిని గుర్తించి జరిమానాలు విధించారు. పెద్దపల్లి పట్టణంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా పర్యటిస్తున్నారని, మాస్కులు ధరించకుండా కనిపిస్తే ఒకరికి రూ. వెయ్యి చొప్పున జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. కరోనా నియంత్రణకు అందరూ సహకరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement