Sunday, November 24, 2024

TS | ఆరు గ్యారెంటీల అమలు చేస్తాం.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రభాకర్

సైదాపూర్, (ప్రభన్యూస్) : ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కాకముందే ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ తదితర కార్యక్రమాలు అమలు చేస్తూ ముందంజలో ఉందని తెలంగాణ‌ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఇవ్వాల (శుక్రవారం) మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాను, హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతానని హామీ ఇచ్చారు. ఎల్లపుడు అందుబాటులో ఉంటానని, బీఆర్ఎస్ ప్రభుత్వం చర్చకు రావాలని 7 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ దేనని, కేసీఆర్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిలు ఇద్దరు ఒకటేనన్నారు. ఆటోల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, కావాలని ఆటోవారిని రెచ్చగొడుతున్నారని మండిపడ్డాడు.

హైదరాబాద్ సిటీలో మెట్రో, ఓలా తదితర సౌకర్యాలతో అటోవాలాలు ఇబ్బందులు పడలేదా, అది అప్పుడు గుర్తుకు రావడం లేదా అన్నారు. స్లిప్పర్ చెప్పులు వేసుకొని వచ్చిన వారికి వందల ఏకరాల ఎలా వచ్చాయన్నారు. కాళేశ్వరం బీట్లు పడి ఉందని,మళ్లీ నిర్మాణం చేయడం తప్ప వేరే మార్గం లేదన్నారు.ప్రజలు ఇబ్బంది పడకుండా వుండాలని నేనే ఈ రోజు వచ్చానని,మళ్ళీ వచ్చి ప్రభుత్వ అధికారులతో సమీక్ష చేస్తానని తెలిపారు.

ప్రజల పట్ల సామరస్య పూర్వకంగా ఉంటూ అధికారులు సంక్షేమానికి కృషి చేయాలన్నారు. లేకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు.జర్నలిస్టుల సమస్యలను నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కాకముందే 420 కేసులు పెడుతున్నారని, అలా అయితే మీ పైన 379 సెక్షన్ కింద దొంగతనం,384 సెక్షన్ కింద ఎక్స్ టార్షన్,392 సెక్షన్ కింద రాభరీ,395 సెక్షన్ కింద దారిదోపిడి తదితర కేసులు నమోదు చేస్తామని తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement