సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని చేనేత జౌలిశాఖ కమిషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి అన్నారు. బుధవారం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలను సందర్శించారు. కలెక్టర్ అనురాగ్ జయంతి తో కలిసి బతుకమ్మ చీరలు తయారవుతున్న యూనిట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎస్ఎస్ఐ యూనిట్ల నిర్వాహకులు, మ్యాక్స్ సొసైటీల నిర్వాహకులు పనిచేస్తున్న కార్మికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాబి జకార్డులను పరిశీలించారు.
పలువురు మ్యాక్స్ సొసైటీల నిర్వాహకులు ఎలాంటి ఉత్పత్తులనైనా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఏడాదంతా పని కల్పించేలా చూడాలని కమిషనర్ ను కోరారు. ప్రభుత్వ పరంగా పూర్తి సహకారాన్ని అందించి అష్ట పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తామన్నారు. పెద్దూరు సమీపంలోని పార్క్ సారంపల్లి టెక్స్టైల్ పార్కులోని యూనిట్లను పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, టెస్కో చైర్మన్ తాడుక యాదగిరి జోలి శాఖ అధికారులు అశోక్ రావు, సాగర్, ఎస్ ఎస్ ఐ ఐర్వాకులు గోవింద్ రవి, యెల్దండి దేవదాస్ మండల సత్యం, దుడం శంకర్ మ్యాథ్స్ సొసైటీల నిర్వాహకులు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.