Saturday, November 23, 2024

అందరినీ ఉద్యోగస్తులుగా చూడాలనుకుంటున్నా.. ఎమ్మెల్యే కోరుకంటి

పట్టుదలతో కృషి చేయండి.. మీ లక్ష్యాలను సాధించుకోండి… రామగుండం నియోజకవర్గంలోని నిరుద్యోగులను ఉద్యోగస్తులుగా చూడాలనుకుంటున్నానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. స్వర్గీయ కోరుకంటి విజయమ్మ నాలుగవ వర్దంతి సందర్భంగా మంగళవారం టిటిఎస్ అంత్గరాంలో కానిస్టేబుల్, ఎస్ఐ ఈవెంట్స్ శిక్షణ తీసుకుంటున్న యువతీ యువకులకు విజయమ్మ పౌండేషన్ ద్వారా ట్రాక్ షూట్స్, షూస్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన తర్వాత 2లక్షల ఉద్యోగాలకు 8 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగుల జీవితాల్లో సీఎం కేసీఆర్‌ నింపుతున్నారన్నారు.

ఒక లక్ష్యం పెట్టుకుని సాధన చేస్తే ఎదైనా సాధించవచ్చన్నారు. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. కరోనా సమయంలో రెండు సంవత్సరాల కాలం వృదాగా పోయిందన్నారు. ప్రస్తుతం రామగుండం నియోజకవర్గం అభివృద్ధి ఎంతగానో జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో రామగుండం నియోజకవర్గాన్ని ముందు వరసలో ఉంచుతామన్నారు. పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు ఇంకా ఏమైనా వసతులు కావాలంటే తాను అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్గా మండల ఎంపీపీ దుర్గం విజయ, జడ్ఫీటీసీ అముల నారాయణ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి మహేందర్ రెడ్డి, సర్పంచులు ధరణీ రాజేష్, కుర్ర వెంకటమ్మతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement