Friday, November 22, 2024

వయోవృద్ధులకు నడక ఆరోగ్యకరం : ఆర్డీవో ఆనంద్ కుమార్

వయోవృద్ధులకు నడక ఎంతో ఆరోగ్యకరమని, నిత్యం తప్పనిసరిగా వృద్ధులు వ్యాయామం చేయాలని కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆనంద్ కుమార్ అన్నారు. వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం “అవగాహన నడక “‘ కార్యక్రమాన్ని నిర్వహించారు. జ్యోతిరావు పూలే మైదానంలో ఆర్డీవో ఆనంద్, జిల్లా సంక్షేమ అధికారి సబిత జెండా ఊపి నడకను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సదుపాయాలను కల్పిస్తున్నదని అన్నారు. వీరి సంరక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వాటన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి కే.సబిత మాట్లాడుతూ వయోవృద్ధుల సమస్యలు పరిష్కరించడానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. వృద్ధుల వారోత్సవాల్లో భాగంగా శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రపంచం వయో వృద్ధుల దినోత్సవం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి వృద్ధులంతా హాజరు కావాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement