నిబంధనలు పాటించకపోతే జరిమానాలు – పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి
సుల్తానాబాద్ : నంబరు ప్లేట్లు లేకుండా వాహనదారులు తమ వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి పేర్కొన్నారు. సోమవారం సుల్తానాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద పోలీస్ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. నంబరు ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ వాహనదారులు తమ వాహనాలకు ముందు, వెనక తప్పనిసరిగా నంబరు ప్లేట్లు అమర్చుకోవాలన్నారు. నంబరు ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నెరమన్నారు. అలాంటి వాహనాలను గుర్తించి సీజ్ చేస్తున్నామన్నారు. రవాణా శాఖ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, లేకపోతే జరిమానాలు తప్పవన్నారు. పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలో ప్రతినిత్యం వాహనాల తనిఖీతోపాటు బ్రీత్ అనలైజర్ ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష పడుతుందన్నారు. తనిఖీలలో సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐ లు ఉపేందర్, వినితతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
నంబరు ప్లేట్లు లేని వాహనాలు సీజ్…
Advertisement
తాజా వార్తలు
Advertisement