పెద్దపల్లిరూరల్: జిల్లాలో యాసంగి వరికోతలు మొదలయ్యాయి. యాసంగిలో జిల్లా వ్యాప్తంగా లక్షా 80వేల ఎకరాలలో రైతులు వరిసాగు చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎస్సారెస్పీకి నీటి తరలింపు, వానాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురియడం, సాగునీటి లభ్యత అనుకూలంగా ఉండడం వల్ల వరిసాగుకు రైతులు మొగ్గు చూపారు. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ బావుల ఆధారిత పొలాలు ముందుగానే నాట్లు వేయడంతో కోత దశకు చేరుకున్నాయి. దీంతో హార్వెస్టర్లతో కోతలను ప్రారంభించారు. హార్వెస్టర్ల యజమానులు వరికోతలకు సిద్ధమ్యేందుకు ఇప్పటికే గ్రామాల్లో వరికోత యంత్రాలను శుద్ధి చేసి మరమ్మతులతో సమాయత్తమవుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వరికోత యంత్రాలు జిల్లాకు తరలిరానున్నాయి. వరికోత యంత్రాలు ఎక్కువ కావడంతో కోతలకు రైతులకు అనుకూలంగా మారనుంది. వరికోత యంత్రాల యజమానులు పొలాల కోతకు అధిక ధరలు వసూలు చేయకుండా ప్రభుత్వం ముందస్తుగానే ధరలు నిర్ణయించి చర్యలు తీసుకోవాలని జిల్లాలోని రైతులు కోరుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement