Friday, November 22, 2024

వరికోతలో జాగ్రత్తలు..

పాలకుర్తి: వరికోతలలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి బి. శశిధర్‌ పేర్కొన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో వరికోతలలో జాగ్రత్తలు, వరి నాణ్యత ప్రమాణాలపై సూచనలు చేశారు. వరిపొలం పూర్తిగా ఆరిన తర్వాత పొలం కోయాలని, హార్వెస్టర్‌ల తగిన ఆర్‌పీఎం వద్దనే పొలం కోతలు చేపట్టాలని, వరి నాణ్యత ప్రమానాలు పాటించేలా చూడాలన్నారు. ఈకార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ ఎర్రం స్వామి, రైతు సమితి మండల అధ్యక్షుడు మదన్‌మోహన్‌రావు, రైతులు మాదాసు రాజేశం, మాదాసు భూమయ్య, కనకయ్య, పీకిలింక శ్రీనివాస్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement