ఎల్లారెడ్డిపేట: మండలంలోని దుమాల గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతు పక్షపాతి సీఎం కేసిఆర్ అని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో కేంద్రం సహకరించకపోయినా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. అలాగే ప్రభుత్వం చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తుందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం అమ్మాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement