రామగిరి: కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని జడ్పీ చైర్మన్ పుట్ట మధు పేర్కొన్నారు. రామగిరి మండలం రామయ్యపల్లి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ చైర్మన్ మధు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర అందించాలనే ఉద్దేశంతోనే గ్రామ గ్రామాన తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని కోరారు. రైతుల ఇబ్బందులు దూరం చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య, జడ్పీటీసీ శారద, సర్పంచ్ పాశం ఓదెలు, రవీందర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement